కరోనా కారణంగా అన్ని రకాల వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. విద్య, వైద్య, ఐటీ ఇలా అన్ని రంగాలతో పాటు రియల్ ఎస్టేట్‌పై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ నేపథ్యంలోనే నిర్మాణం జరుపుకున్న ఎన్నో ఫ్లాట్స్ కొనుగోలుదారులు లేక నిరుపయోగంగా మిగిలిపోయాయి. అయితే తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే హైదరాబాద్ రియల్ ఏస్టేట్ రంగానికి పూర్తి వైభవం వచ్చినట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడమే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంతకీ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ జోరుకు కారణం ఏంటి.? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉండనుంది.?లాంటి ఆసక్తికర విషయాలు..
రూపాయి క్షీణించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోన్న విషయం తెలిసిందే. పలు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఇదే అంశం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తోంది. భారీగా పతనమైన రూపాయి కారణంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా హైదరాబాద్‌నే ఎంచుకుంటుండడం విశేషం. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచింది.
సీఐఐ-అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజినయ్ (NCR), బెంగళూరులో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తన్నట్లు తేలింది. ఇక ఆర్థిక రాజధాని ముంబై నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఎన్నారైల్లో కనీసం 60 శాతం మంది ఈ మూడు నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తేలింది. వీరిలో గరిష్టంగా 22 శాతం మంది హైదరాబాద్‌లో, 20 శాతం మంది ఎన్‌సిఆర్, 18 శాతం మంది బెంగళూరుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సర్వేలో మొత్తం 5500 మంది పాల్గొన్నారు. వీరిలో అమెరికా, కెనడా, గల్ఫ్, యూపర్‌తో పాటు పలు ఆసియా దేశాలకు చెందిన 7 శాతం ఎన్నారైలు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడానికే ఇష్టపడుతున్నట్లు తేలింది. సర్వే ప్రకారం 2021తో పోల్చితే 2022 తొలి 9 నెలల్లో హౌసింగ్ ఎన్‌ఆర్‌ఐ డిమాండ్‌లో 15 నుంచి 20 శాతం పెరిగింది.
ఈ విషయమై అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘కరానో ప్యాండమిక్ తర్వాత ప్రజల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. భద్రతతో కూడిన ఇళ్లు అనేది భారతీయులకు మొదటి ప్రాధాన్యత. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ తగ్గం ఎన్నారైలకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఆ కారణంగానే ఇండియన్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. సగటున ప్రతీ త్రైమాసికంలో విక్రయించిన ఇళ్లలో 10 నుంచి 15 శాతం వాటా ఎన్నారైలతో కావడం విశేషం. సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. 77 శాతం మంది పెద్ద ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 54శాతం మంది 3 బీహెచ్‌కే, కేవలం 22 శాతం మంది మాత్రమే 2బీహెచ్‌కే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది ఎన్నారైలు రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల ధరల్లో ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో రూపాయి మరింత పతనం కానుందన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత దూసుకుపోనుందన్న వార్తలకు బలం చేకూరినట్లైంది.
మీరు కూడా విదేశాల నుంచి వస్తోన్న నిధులను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుంటున్నారా.? మీలాంటి వారి కోసం టీవీ9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్ పో సరైన వేదిక. ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అత్యంత విశ్వసనీయత కలిగిన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో లో పాల్గొనడం ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీరుతెన్నులు తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..