4 రోజుల ముందు డ్రగ్స్‌ తీసుకున్నా ఈ మిషన్ కనిపెట్టేస్తుంది.. పోలీసుల చేతికి సరికొత్త కిట్స్.. ఇక తాట తీసుడే..

|

Jul 09, 2024 | 8:14 PM

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులకు సరికొత్త ఆయుధాలు సమకూర్చింది. ఆయుధాలంటే ఇవి వెపన్స్‌ కావు.. సరికొత్త డ్రగ్ టెస్టింగ్ కిట్స్‌..

4 రోజుల ముందు డ్రగ్స్‌ తీసుకున్నా ఈ మిషన్ కనిపెట్టేస్తుంది.. పోలీసుల చేతికి సరికొత్త కిట్స్.. ఇక తాట తీసుడే..
Drugs Case
Follow us on

డ్రంక్ అండ్ డ్రైవ్‌ చెక్‌ తరహాలోనే ఇకపై నిముషాల్లో డ్రగ్‌ టెస్టింగ్ డ్రైవ్స్‌కి సిద్ధమవుతోంది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో. యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ పార్టీలపై రైడ్ చేసినపుడు కొందరు తాము డ్రగ్స్‌ తీసుకోలేదని గొడవలకు దిగుతుంటారు. ఇప్పటి వరకు పట్టుబడిన వారి నుంచి శాంపిల్స్ తీసుకుని, ల్యాబ్‌కు పంపించి, వాటి రిజల్ట్ వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునే వారు. ఈ గ్యాప్‌లో కొందరు అతితెలివి ప్రదర్శిస్తూ.. శాంపిల్స్ ఇచ్చేందుకు టైం తీసుకోవడం.. తాము అందుబాటులో లేమంటూ తప్పించుకునే ప్రయత్నం చేసేవారు. ఇకపై ఇలాంటివి కుదరవు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు అధికారులు లేటెస్ట్ డ్రగ్‌ టెస్టింగ్ కిట్స్‌ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కిట్స్‌తో యూరిన్ శాంపిల్స్, సలైవాతో కేవలం నిమిషాల వ్యవధిలో ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా.. లేదా.. అనేది తెలుసుకుంటున్నారు. కేవ్ పబ్ ఉదంతం తర్వాత పబ్స్ లో డ్రగ్స్ సేవించి పార్టీ నిర్వహించే వారిలో వణుకు పుడుతోంది.

సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన కిట్లనే డ్రగ్‌ టెస్ట్‌ల కోసం వాడుతున్నారు. సలైవా శాంపుల్ టెస్టింగ్ కిట్ జర్మనీ నుంచి, యూరిన్ శాంపుల్ టెస్టింగ్ కిట్స్‌ జపాన్ , అమెరికా నుంచి TGANB అధికారులు దిగుమతి చేసుకున్నారు. ఈ కిట్స్‌ ద్వారా కొకైన్, గంజాయి, ఓపియేట్స్, యాంఫేటమిన్లు, మెథాంఫేటమిన్లు, కెటామైన్‌లతో సహా వివిధ రకాల డ్రగ్స్‌ను వ్యక్తులు సేవించారో లేదో నిముషాల్లో తెలుసు కోవచ్చు. 4 రోజుల ముందు డ్రగ్స్‌ తీసుకున్నా ఈ టెస్ట్ కిట్ల ద్వారా తెలిసిపోతుంది.

తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్ చేయడానికి TGANB అధికారులు సరి కొత్త విధానాలు అనుసరిస్తుండటంతో డ్రగ్‌ అడిక్ట్స్‌ గుండెల్లో గుబులు మొదలైంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..