Weather: రుతుపవనాలపై మరో అప్డేట్ వచ్చేసింది.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

తెలంగాణలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ, రాబోయే మూడు రోజులలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

Weather: రుతుపవనాలపై మరో అప్డేట్ వచ్చేసింది.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
Telangana Weather Update

Updated on: May 23, 2026 | 3:49 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. సాధారణంగా అన్నిప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తెలంగాణలో సైతం 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల అప్డేట్ పై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తీవ్రమైన ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి ఒకటి నైరుతి బీహార్ దాని పరిసరాలలో ఏర్పడిన ఉపరితల చక్రవాహత ఆవర్తనము నుండి జార్ఖండ్, ఉత్తర చత్తీస్గడ్, అంతర్గత ఒడిశాల మీదుగా ఉత్తరకొస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. అంతర్గత ఒరిస్సా దాని సమీపాలలో నిన్న కొనసాగిన ఉపరితల చక్రవాక ఆవర్తనం ఈరోజు బలహీన పడింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)

శనివారం, ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

శనివారం, ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో రెండు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us