తెలంగాణ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదల కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని.. ఫలితాల ప్రాసెసింగ్ చివరి దశలో ఉందని అధికారులు తెలిపారు. వారంలో రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చునని అనధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇంటర్ ఫలితాలు మే 10న, పదో తరగతి ఫలితాలు మే 12న ప్రకటించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారుల సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. అటు ఇంటర్‌కు 5,05,625 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోగా.. పది పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.