Hyderabad: ఐటీ ఉద్యోగుల కోసం ఆర్టీసీ బంపరాఫర్‌.. ఫ్రీ వైఫైతో కూడిన మినీ బస్సులు.

వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతోంది తెలంగాణ ఆర్టీసీ. సజ్జనర్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సరికొత్త నిర్ణయాలతో ఆర్టీసీ లాభాల బాటలో పట్టిస్తున్నారు. ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టడం, యూపీఐ పేమెంట్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవడం ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులకు...

Hyderabad: ఐటీ ఉద్యోగుల కోసం ఆర్టీసీ బంపరాఫర్‌.. ఫ్రీ వైఫైతో కూడిన మినీ బస్సులు.
Rtc Mini Buses

Updated on: Jan 09, 2023 | 6:27 AM

వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతోంది తెలంగాణ ఆర్టీసీ. సజ్జనర్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సరికొత్త నిర్ణయాలతో ఆర్టీసీ లాభాల బాటలో పట్టిస్తున్నారు. ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టడం, యూపీఐ పేమెంట్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవడం ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. ఐటీ కంపెనీల నుంచి మెట్రో స్టేషన్‌కు కనెక్టివిటీ పెంచేందుకు మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ బస్సులు నేటి నుంచి (సోమవారం) అధికారికంగా ప్రారంభించనున్నారు. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న వేవ్‌ రాక్‌ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు ఈ బస్సులను నడపనున్నారు. ఉదయం 7.45 నుంచి 11.42 వరకు, సాయంత్రం 4.45 నుంచి రాత్రి 7.50 వరకు ప్రతి పదిహేను నిమిషాలకు ఓ బస్సు నడుస్తుంది. ఘర్‌ నుంచి రాయదుర్గం మెట్రోకు ఉదయం 7.55 నుంచి 10.30, అదే విధంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8.45 వరకు ప్రతీ పదిహేను నిమిషాలకు ఓ బస్సు ఉంటుంది. ఇక డీఎల్ఎఫ్ నుంచి రాయదుర్గం వరకు ఉదయం 8.40 నుంచి 11.30, సాయంత్రం 4.45 నుంచి రాత్రి 7.35 వరకు ప్రతీ ముప్పై నిమిషాలకు ఓ బస్సు ఉంటుంది.

ఇదిలా ఉంటే రాయదుర్గం మెట్రో నుంచి వేవ్​రాక్ వరకు ఉదయం 7.10 నుంచి మధ్యాహ్నం 12.32, సాయంత్రం 5.20 నుంచి 8.24 వరకు ప్రతీ పదిహేను నిమిషాలకు ఓ బస్సు నడవనుంది. ఇక ఘర్ ​సంస్థకు రాయదుర్గం మెట్రో నుంచి ఉదయం 7.20 నుంచి 11.20 వరకు, సాయంత్రం 4.40 నుంచి రాత్రి 9.20 వరకు ప్రతి పదిహేను నిమిషాలకు ఓ బస్సును నడపనున్నారు. రాయదుర్గం మెట్రో నుంచి డీఎల్ఎఫ్ ​సంస్థకు ఉదయం 8.10 నుంచి మధ్యాహ్నం 12.10, సాయంత్రం 5.20 నుంచి రాత్రి 8.10 నిమిషాల వరకు ప్రతీ ముప్పై నిమిషాలకు ఓ బస్సును తిప్పనున్నారు. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ సదుపాయం ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..