Telangana Police: పోలీసు సేవలపై.. తెలంగాణ విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాస రచన, ఫోటోగ్రఫీ పోటీలు.. ఎంట్రీలు ఇలా పంపండి

|

Oct 20, 2021 | 2:28 PM

విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 న తెలంగాణ పోలీస్ శాఖ "పోలీస్ ఫ్లాగ్ డే" జరుపుకుంటోంది.

Telangana Police: పోలీసు సేవలపై.. తెలంగాణ విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాస రచన, ఫోటోగ్రఫీ పోటీలు.. ఎంట్రీలు ఇలా పంపండి
Telangana Police (File Photos)
Follow us on

Police Flag Day: విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 న తెలంగాణ పోలీస్ శాఖ “పోలీస్ ఫ్లాగ్ డే” జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాస రచన, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు (8 వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు) తెలంగాణ పోలీస్ నిర్వహించే ఆన్‌లైన్ వ్యాస రచన పోటీలో( తెలుగు / ఉర్దూ / ఇంగ్లీషులో) పాల్గొనవలసినదిగా ఓ ప్రకటనలో తెలంగాణ పోలీస్ శాఖ కోరింది.  అక్టోబర్ 24 తేదీ లోపు విద్యార్థులు వారి వ్యాసాలను సమర్పించాల్సి ఉంటుంది.

వ్యాస రచన అంశం(Topic): “జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర”.

ఇది 3 విభాగాలలో నిర్వహించబడుతుంది.
మొదటి విభాగం: 8 నుంచి 10 వ తరగతి విద్యార్థులు
రెండవ విభాగం: ఇంటర్మీడియట్ విద్యార్థులు
మూడవ విభాగం: డిగ్రీ విద్యార్థులు

మీ వ్యాసాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి క్రింది పద్దతిని(steps) అనుసరించండి:

1. సబ్మిట్ చేయటానికి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.
https://forms.gle/HvF8YAgewvyD3wjA9
2. మీ పేరు, తరగతి మరియు ఇతర వివరాలను నమోదు చేయండి
3. మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో 300 పదాలకు మించకుండా సమర్పించండి.

అలాగే ఫోటోగ్రఫీ పోటీలకు ఎంట్రీలను ఈ దిగువ లింక్ ద్వారా అక్టోబర్ 28 వరకు పంపాలి. పోలీసుల సేవలకు సంబంధించిన ఆకర్షణీయమైన ఫోటోలను ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు పంపాలి.

https://forms.gle/uJj58xXN1GQPNjp8A

జిల్లా / కమిషనరేట్‌లో ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు సంబంధిత పోలీసు సూపరింటెండెంట్ / పోలీసు కమీషనర్లు బహుమతి ప్రదానం చేస్తారు మరియు ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా / కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయడం జరుగుతుంది.

అన్ని జిల్లా / కమిషనరేట్ల స్థాయిలలో బహుమతులు గెలుపొందిన వ్యాసాలలో నుండి ఉత్తమ మూడు వ్యాసాలను “రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ వ్యాసాలు” గా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుంది.

Also Read..

AP Politics: మేమేం తక్కువ కాదన్నట్లు.. ఏపీ రాజకీయ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ మంత్రి..!

Virat Kohli: విరుష్క ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. ఫ్యామిలీ ఫొటోలో వామికా ఫేస్ మిస్.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారంటూ కామెంట్లు