పటాన్‌చెరు, జులై 27: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మృతి చెందారు.
విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్‌కు వైద్యులు డయాలసిస్ చేశారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 2 గంటలకు గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసానికి తరలించారు. కుమారుడి మృతితో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.