Minister Sabitha’s Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ సూసైడ్.. పాయింట్‌ బ్లాక్‌లో గన్‌తో కాల్చుకుని మృతి!

|

Nov 05, 2023 | 10:18 AM

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. కూతురు ముందే గన్‌తో కాల్చుకుని ఏఎస్ఐ అధికారి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోన్న సంగతి తెలిసిందే. మంత్రి వద్ద ఏఎస్ఐ ఫాజాన్‌ అలీ ఎస్కార్ట్ అధికారి పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ శ్రీనగర్ కాలనీలో మణికంఠ హోటల్‌లో వద్ద అతను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గన్‌తో కల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడిని ఏఎస్‌ఐ ఫైజల్‌గా పోలీసులు గుర్తించారు. అతను మంత్రి సబితా వద్ద గన్‌మెన్‌గా..

Minister Sabithas Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ సూసైడ్.. పాయింట్‌ బ్లాక్‌లో గన్‌తో కాల్చుకుని మృతి!
Minister Sabitha's Gunman Suicide
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 5: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. కూతురు ముందే గన్‌తో కాల్చుకుని ఏఎస్ఐ అధికారి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోన్న సంగతి తెలిసిందే. మంత్రి వద్ద ఏఎస్ఐ ఫాజాన్‌ అలీ ఎస్కార్ట్ అధికారి పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ శ్రీనగర్ కాలనీలో మణికంఠ హోటల్‌లో వద్ద అతను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గన్‌తో కల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడిని ఏఎస్‌ఐ ఫైజల్‌గా పోలీసులు గుర్తించారు. అతను మంత్రి సబితా వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఫజాన్ అలీ గన్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ రోజు ఉదయం కూతురిని తీసుకుని డ్యూటీకి వచ్చిన ఫజల్ అలీ కూతురు ముందే గన్‌తో కాల్చుకున్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. లోన్ రికవరీ వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. లోన్‌ కింద గతంలో మూడు లక్షల రూపాయలు ఫజల్‌ చెల్లించాడు. అయితే మొత్తం పది లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా లోన్ రికవరీ వారు ఫజల్‌ను వేధింపులకు గురిచేశారు. దీంతో మరణమే శరణం అనుకున్నాడేమో సూసైడ్‌కు పాల్పడ్డాడు. మంత్రి సబితా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.