AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: బీజేపీ పాలనలో దేశమంతా పేదరికంలో ఉండిపోయింది.. ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధాని మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీని అధికారంలోకి...

KTR: బీజేపీ పాలనలో దేశమంతా పేదరికంలో ఉండిపోయింది.. ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
Minister Ktr
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 6:33 AM

Share

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధాని మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే రైతు ఆదాయం డబుల్ చేస్తానన్న ప్రధాని.. అదానీ ఆదాయం మాత్రమే పెరిగేలా చేశారని మండిపడ్డారు. దేశమంతా పేదరికంలో ఉండిపోయిందని ఆక్షేపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే మొత్తం నల్గొండ జిల్లా అంతా బాగుపడుతదని ప్రధాని మోడీ అనుకుంటున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ధనవంతులైతే నల్గొండ రైతు బిడ్డల ఆదాయం పెరగదని మంత్రి కేటీఆర్ చెప్పారు.18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను నల్గొండ జిల్లా అభివృద్ధికి ఇవ్వాలని, అలా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ బీజేపీ నాయకుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి ఉన్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. మిగతా రాష్ట్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ రైతుల కన్నీరు తుడిచే నాయకుడు లేడు. రైతుల గురించి ఆలోచించే వ్యక్తి కేసీఆర్ మాత్రమే. రైతుల కష్టాలు అవగాహన చేసుకుని, ఆదుకున్న నాయకులు ఎవరూ లేరు. కానీ సీఎం కేసీఆర్ మాత్రమే రైతులను ఆదుకున్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదు. ఒకవేళ అలా ఇస్తున్న రాష్ట్రం ఉంటే చూపించాలి.

– కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

పది సంవత్సరాలు వెనక్కు వెళితే.. కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ కోతలు, చార్జీల మోతలు, పోలీసు స్టేషన్లలో విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో చెప్పులు వంటి దుస్థితి ఉండేది. అంతే కాకుండా రైతు ఆత్మహత్యలు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో అధికంగా ఉండేవి. కానీ ఇప్పుడు వరిధాన్యం సాగులో ఉమ్మడి నల్గొండ అగ్ర స్థానంలో ఉంది. ఇవాళ తెలంగాణలో కరెంట్ కోతల్లేవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..