KTR: పేదలకు ఇస్తే ఉచితాలు.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా.. కేంద్రం వైఖరిపై కేటీఆర్ ఫైర్

|

Aug 13, 2022 | 8:23 PM

తెలంగాణ (Telangana) ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. కేంద్రం చేస్తున్న విమర్శలను తెలంగాణ నేతలు ఖండిస్తుండగా తెలంగాణ విమర్శలనూ కేంద్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం వైఖరిపై మరోసారి తెలంగాణ...

KTR: పేదలకు ఇస్తే ఉచితాలు.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా.. కేంద్రం వైఖరిపై కేటీఆర్ ఫైర్
Ktr
Follow us on

తెలంగాణ (Telangana) ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. కేంద్రం చేస్తున్న విమర్శలను తెలంగాణ నేతలు ఖండిస్తుండగా తెలంగాణ విమర్శలనూ కేంద్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం వైఖరిపై మరోసారి తెలంగాణ స్పందించింది. ప్రజా సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోడీ విధానమేమిటో వివరించి, దేశ ప్రజలతో చర్చించాలని మంత్రి కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోన్న సంక్షేమ పథకాలను డిమాండ్ చేస్తారా లేదానని ప్రశ్నించారు. ఉచిత సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి, వచ్చే ఎన్నికలకు వెళ్తారా అని నిలదీశారు. రాష్ట్రాలు, కేంద్రం అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు పార్లమెంట్‌లో చట్ట సవరణలు చేస్తారా అని నిలదీశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశాక జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో పేదల సంక్షేమ పథకాలపై ప్రధాని వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మీ దృష్టిలో ఏది ఉచితం. ఏది అనుచితమో చెప్పండి. పేదలకు ఇస్తే ఉచితాలు.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?.అని నిలదీశారు. రైతులకు రుణమాఫీ చేదు.. కార్పొరేట్‌ రుణమాఫీ ముద్దా?. నిత్యావసరాలపై జీఎస్టీ వేస్తూ కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇవ్వడమేంటి. ఎనిమిదేళ్ల పాలనలో బడా బాబులకు, రైతన్నకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని. పాలు, పెరుగుపై నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేశారు. పేదల ప్రజల నోటికాడి కూడును లాగేస్తున్నారు. రూ.80లక్షల కోట్లు అప్పును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చు చేశారు. పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చారా?.

 – కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం