బీజేపీ నేతలందరూ సత్యహరిశ్చంద్రుడి బంధువులనుకుంటున్నారా.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్

|

Jun 11, 2022 | 1:22 PM

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలందరూ సత్య హరిశ్చంద్రుడి బంధువులనుకుంటున్నారా అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ ఎనిమిదేళ్ల పాలనలో....

బీజేపీ నేతలందరూ సత్యహరిశ్చంద్రుడి బంధువులనుకుంటున్నారా.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్
Telangana Minister KTR
Follow us on

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలందరూ సత్య హరిశ్చంద్రుడి బంధువులనుకుంటున్నారా అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ(BJP Leaders) నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఎన్ని జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఇతరులకు అమ్మడం వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ యువతతో కలిసి టీఆర్ఎస్(TRS) తరఫున ఆందోళనలు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తెలంగాణ ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే కేంద్రం మాత్రం ఉద్యోగాల భర్తీని వదిలేసిందని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధానిగా మోడీ విఫలమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘భాజపా నేతలు, వారి బంధువులు, సన్నిహితులపై గత ఏనిమిదేళ్లలో ఎన్ని సార్లు ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి? భాజపా నేతలందరూ సత్య హరిశ్చంద్రుడి బంధువులనుకుంటున్నారా?’’

        – ట్విటర్ లో మంత్రి కేటీఆర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి