తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు తిరుమల వచ్చారు. అలిపిరి కాలినడక మార్గంలో నడచారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద కొబ్బిరి కాయ కొట్టి కాలినడక ప్రారంభించారు. తిరుమలకు చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు(Minister Harish Rao) శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం శ్రీవారిని మంత్రి హరీశ్ రావు దర్శించుకోనున్నారు. మరోవైపు.. నేడు మంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా తనకు మెసేజ్ లు, ఫోన్ లు చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాను హైదరాబాద్ లో గానీ, సిద్దిపేటలో గానీ ఉండటం లేదని, వ్యక్తిగత పనుల కోసం దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తన పట్ల ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చూపించాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి