Viral Video: హైద‌రాబాద్ జూపార్క్‌లో యువ‌కుడి హ‌ల్‌చల్.. సింహం ఎన్‌క్లోజ‌ర్ లోకి దూకేందుకు య‌త్నించిన యువ‌కుడు.. అడ్డుకున్న జూ సిబ్బంది

|

Nov 23, 2021 | 6:34 PM

సింహాం నొట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా ? సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం ఉందా ? ఖచ్చితంగా లేదు. పులి, సింహాలను ఎన్‌క్లోజర్ నుంచి చూడాలంటేనే గజ్జున వణికిపోతారు.

Viral Video: హైద‌రాబాద్ జూపార్క్‌లో యువ‌కుడి హ‌ల్‌చల్..  సింహం ఎన్‌క్లోజ‌ర్ లోకి దూకేందుకు య‌త్నించిన యువ‌కుడు.. అడ్డుకున్న జూ సిబ్బంది
Man Climbs Lion Den
Follow us on

Man climbs Hyderabad Zoo Park Lion Den: సింహం నొట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా ? సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం ఉందా ? ఖచ్చితంగా లేదు. పులి, సింహాలను ఎన్‌క్లోజర్ నుంచి చూడాలంటేనే గజ్జున వణికిపోతారు. అలాంటిదీ.. దాని వద్దకెళ్లడం అంటే మాములు విషయం కాదు. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూపార్క్‌లో ఓ యువకుడు సింహం ఎన్‌క్లోజర్‌ దగ్గరవరకు వెళ్లాడు. అంతేకాదు సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎన్‌క్లోజర్‌లో అతని సాహసాన్ని బయట నుంచి చూస్తోన్న జనం గజగజ వణికిపోయారు.

సింహాన్ని బోనులోంచి చూడాలంటేనే గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది. అలాంటిది అది ఉండే చోటికి వెళ్తే ఎలా ఉంటుంది. ఊహించనంత భయానకరంగా ఉంటుంది. దాని గాండ్రింపు… వేటాడేందుకు అది చూస్తున్న ఆకలి చూపులు…ఒక్క మాటలో చెప్పాలంటే చావు కళ్ల ముందు కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ జూపార్క్‌కు వచ్చిన ఓ ఆకతాయి సింహంతో సింగల్‌గా ఫోజు ఇవ్వాలనుకున్నాడు. జూ పార్క్‌లోకి సందర్శకుల్ని అనుమతించిన అధికారులు.. పులులు, సింహాలు ఉండే ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్న విషయాన్ని మర్చిపోయారు. దీంతో.. జూపార్క్‌కి వచ్చిన ఓ యువకుడు డైరెక్ట్‌గా సింహం ఉండే గుహ బండరాళ్లపై కూర్చున్నాడు. సింహంతో ఆటాడే సాహసం చేశాడు. అంతే వాడ్ని వేటాడేందుకు సింహం తెగ ట్రై చేసింది.

ఇదంతా చూస్తున్న జనం గగ్గొలు పెట్టారు. అయినా వినకుండా దానిముందే బండరాయిపై కూర్చున్నాడు. లేచాడు, సింహాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూస్తున్న సందర్శకుల గుండె ఆగినంత పనైపోయింది. చివరికి విషయం జూ అధికారుల కళ్లలో పడటంతో వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని బహుదూర్‌పూర పోలీసులకు అప్పగించారు.

 

Read Also… Gas Cylinder Blast: నానక్‌రామ్‌ గూడలో భారీ పేలుడు.. 11 మందికి గాయాలు..