తెలంగాణ హైకోర్టు దిశ ఘటనపై స్పందించింది. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలను ఖండించింది. ఇకపై త్వరితగతిన విచారణను వేగవంతం చేసేందుకు హైకోర్టు ప్రత్యేక కోర్టు, న్యాయమూర్తులను నియమించింది. 11 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు సంబంధించి.. పదకొండు జడ్జిలను నియమించింది హైకోర్టు. అత్యాచార ఘటనలపై ప్రత్యేకమైన కోర్టులో విచారణ వేగవంతంగా చేపట్టాలని, నిందితులకు కఠిన శిక్షలు అమలు పరచాలని ఆదేశించింది. దిశ ఘటన తర్వాత మళ్లీ ఎలాంటి నేరాలు జరగకుండా, మహిళలకు భద్రత ఉండేందుకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.