Gaddiannaram Market: గడ్డి అన్నారం మార్కెట్‌ తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. వ్యాపారులు వెళ్లిపోవాలంటూ..

|

Mar 16, 2022 | 7:32 AM

Gaddiannaram Fruit Market: హైదరాబాద్‌ గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం దురదృష్టమంటూ

Gaddiannaram Market: గడ్డి అన్నారం మార్కెట్‌ తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. వ్యాపారులు వెళ్లిపోవాలంటూ..
Follow us on

Gaddiannaram Fruit Market: హైదరాబాద్‌ గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం దురదృష్టమంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18నాటికి మార్కెట్‌ను ఖాళీ చేయాలని సూచించింది. గడ్డి అన్నారం మార్కెట్‌ను.. బాటసింగారం తాత్కాలిక మార్కెట్‌కు తరలించాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడిచేలా..సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి వ్యాపారులు అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది హైకోర్టు. బాటసింగారం తాత్కాలిక మార్కెట్‌లో సరైన సదుపాయాలు లేవంటూ గతంలో కోర్టును ఆశ్రయించారు వ్యాపారులు. ఆ పిటిషన్లపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. వ్యాపారులు ఖాళీ చేసేందుకు వీలుగా నెలపాటు మార్కెట్‌ తెరవాలని గత నెలలో మార్కెటింగ్‌ శాఖను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ మార్కెట్‌లోకి వెళ్లనీయడం లేదని వ్యాపారులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు వెంటనే మార్కెట్‌ తెరిచారు.

అదే సమయంలో మార్కెట్‌లో కూల్చివేతలు చేపట్టడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరైన అధికారులు కోర్టు ఆదేశాలమేరకు కూల్చివేతలు నిలిపివేసిన విషయాన్ని కోర్టుకు విన్నవించారు. విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం నాటికి వ్యాపారులు మార్కెట్‌ ఖాళీ చేసి బాటసింగారం వెళ్లాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.

Also Read:

Telangana CM KCR: ఆ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఇక నుంచి ప్రభుత్వమే..

Sajjanar – TSRTC: సజ్జనార్ సార్ మీరు కేక.. ఆర్టీసీ కోసం ‘ఆర్ఆర్‌ఆర్’ని ఈసారి ఇలా వాడేసారు..!