హుస్సేన్‌సాగర్‌ సమీపంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం

|

Sep 16, 2020 | 8:00 PM

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి జీవో 2 విడుదలైంది. హుస్సేన్‌సాగర్‌ సమీపంలో 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోంది. ఇందుకోసం 140 కోట్లను ఖర్చు చేయనున్నారు.

హుస్సేన్‌సాగర్‌ సమీపంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం
Follow us on

BR Ambedkar statue : రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి జీవో 2 విడుదలైంది. హుస్సేన్‌సాగర్‌ సమీపంలో 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోంది. ఇందుకోసం 140 కోట్లను ఖర్చు చేయనున్నారు. బాబా సాహెబ్‌ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీమేరకు.. సర్కార్‌ అడుగులు వేస్తోంది.

సువిశాలమైన స్థలంలో అంబేద్కర్‌ పార్కును నిర్మించబోతోంది తెలంగాణ సర్కార్‌. విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు ఉంటుందని మంత్రులు ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. ఈ మేరకు విగ్రహ నమూనాను కూడా విడుదల చేశారు.

అంబేద్కర్‌ విగ్రహానికి వాడే స్టీల్‌ 791 టన్నులు కాగా.. ఇత్తడి 96 మెట్రిక్‌ టన్నులుగా తెలిపారు.