Hyderabad Metro: ఇక తెలంగాణ సర్కార్‌ వారి మెట్రో.. మే ఫస్ట్ నుంచి సరికొత్త చరిత్ర..

హైదరాబాద్‌ మెట్రో ఇక సర్కార్‌ వారి మెట్రో. ఎల్‌ అండ్‌ టీ నుంచి హైదరాబాద్‌ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌ చేసింది. ఎల్‌ అండ్‌ వాటాలను స్వాధీనంచేసుకుంది.ఇక మే ఫస్ట్‌ నుంచి మెట్రో నిర్వహణ ఇక ప్రభుత్వ ఆధీనంలోనే.. ఇన్నాళ్లు ఎల్‌ అండ్‌ టీ , MRHL నిర్వహణలో ఉన్న మెట్రో రైల్‌ను ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌ చేయనుంది.

Hyderabad Metro: ఇక తెలంగాణ సర్కార్‌ వారి మెట్రో.. మే ఫస్ట్ నుంచి సరికొత్త చరిత్ర..
Hyderabad Metro Rail

Updated on: Apr 26, 2026 | 8:44 AM

హైదరాబాద్‌ మెట్రో ఇక సర్కార్‌ వారి రైల్‌.. ఇన్నాళ్లు ఎల్‌ అండ్‌ టీ , MRHL నిర్వహణలో ఉన్న మెట్రో రైల్‌ను ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌ చేయనుంది. మే ఫస్ట్‌ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెట్రో పరుగులు తీయనుంది. మెట్రో చైర్మన్‌గా చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావుకు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. అలాగే మెట్రో నిర్వహణ కోసం అధికారులను నియమించింది. సర్పరాజ్‌ అహ్మద్‌ను మెట్రో ఎండీగా కొనసాగిస్తూ, జయేష్‌ రంజన్‌, వికాస్‌రాజ్‌, సుల్తానియా, డీజీపీ శివధర్‌ను మెట్రో డైరెక్టర్లుగా నియమించింది ప్రభుత్వం.

ఈ నెల 30న 15వేల కోట్ల డీల్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 13 వేల కోట్ల రుణాలు, రూ.2 వేల కోట్ల ఈక్విటీ .. 100 శాతం ఈక్విటీతో షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌తో మెట్రో ను టేకోవర్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. IRFC నుంచి తీసుకునే లోన్‌ను మెట్రో సంస్థనే తిరిగి చెల్లిస్తుంది. కాకపోతే ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. రుణం తీర్చాల్సిన గడువు 20 ఏళ్లు..

హైదరాబాద్‌ మెట్రో నిర్వహణ కోసం 13వేల 615 కోట్ల రుణాన్ని అందించేందుకు IRFC గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందుకు సంబందించిన డాక్యుమెంట్లకు, అగ్రిమెంట్‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. టేకోవర్‌ ప్రాసెస్‌లో భాగంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక సిఫార్సులను చేసింది. ఈ నెల డీల్ పూర్తికాగానే.. మే నుంచి జూన్‌ వరకు కమిర్షియల్‌ పేపర్లపై పది కోట్ల 47 లక్షల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఐతే ఎల్‌ అండ్‌ టీకి ఇచ్చిన 900 కోట్ల వడ్డీలేని రుణాన్ని .. టేకోవర్‌ సంబదర్భంగా చెల్లించాల్సిన 15 వేల కోట్ల నుంచి మినహాయించాలని సూచించింది. అలాగే ఎల్‌ అండ్‌ టీ బకాయి వున్న GHMC ఆస్తి పన్నులో ఎలాంటి మినహాయింపులు అవసరంలేదని స్పష్టం చేసింది.

గాడిలో పడేంత వరకు నిపుణుల గైడెన్స్‌

మే ఒకటి నుంచి హైదరాబాద్‌ మెట్రో నిర్వహణ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతోంది. నిర్వహణ గాడిలో పడేంత వరకు సీనియర్‌ నిపుణులను, ఎల్‌ అండ్‌ టీ,MRHLకు చెందిన కొంత మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. వారి వేతనాలను ఆయా సంస్థలే భరిస్తాయి. అలాగే కోర్టుల్లో పెండింగ్‌ కేసులకు సంబంధించి ఎల్‌ అండ్‌ టీ ప్రాతినిధ్యం కోసం స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ తీసుకోవాలని సూచించింది. ఇక క్లెయిమ్‌ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా చర్యలు తీసుకోవాలంది కేబినెట్‌ సబ్‌ కమిటీ..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us