ఒక్క నెలలో రూ.2.25 కోట్ల ఫైన్ వసూలు.. తెలంగాణ రికార్డు!

| Edited By:

Feb 05, 2020 | 12:36 PM

ఒకే ఒక్క నెలలో తెలంగాణ ప్రభుత్వం రూ.2.25 కోట్ల ఫైన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మధ్య మద్యం తాగి.. రోడ్డు ప్రమాదాలకు గురై.. పలువురు చనిపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కఠిన తరమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఇంతకు ముందు డ్రైవర్లు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే.. కేవలం రూ.2 వేలు మాత్రమే జరిమానా కట్టేవారు. కానీ.. కొత్త ఎంవీ చట్టం ప్రకారం.. మద్యం తాగి వాహనం నడుపుతున్నందుకు.. ట్రాఫిక్ పోలీసులు వారి వద్ద […]

ఒక్క నెలలో రూ.2.25 కోట్ల ఫైన్ వసూలు.. తెలంగాణ రికార్డు!
Follow us on

ఒకే ఒక్క నెలలో తెలంగాణ ప్రభుత్వం రూ.2.25 కోట్ల ఫైన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మధ్య మద్యం తాగి.. రోడ్డు ప్రమాదాలకు గురై.. పలువురు చనిపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కఠిన తరమైన నిబంధనలను తీసుకొచ్చింది.

ఇంతకు ముందు డ్రైవర్లు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే.. కేవలం రూ.2 వేలు మాత్రమే జరిమానా కట్టేవారు. కానీ.. కొత్త ఎంవీ చట్టం ప్రకారం.. మద్యం తాగి వాహనం నడుపుతున్నందుకు.. ట్రాఫిక్ పోలీసులు వారి వద్ద నుంచి 10,500 రూపాయలను వసూలు చేస్తున్నారు. అలా.. ట్రాఫిక్ పోలీసులు విరివిగా.. కోర్టు రూల్స్‌ని పాటించి.. ఇప్పటివరకూ రూ.2.25 కోట్ల ఫైన్‌ని వసూలు చేశారు.

కాగా.. ఈ ఫైన్ కేవలం 31 రోజుల్లో 2,254 డ్రైవర్ల నుండి అధికారులు వసూలు చేశారు. పోలీసుల గణాంకాల ప్రకారం, జనవరి నెలలో మాత్రమే 2,254 మంది తాగుబోతు డ్రైవర్లకు మెట్రోపాలిటన్ III, IV మేజిస్ట్రేట్ కోర్టులు రూ.2,25,81,400 కోట్ల జరిమానాను విధించాయి.

ఈ సందర్భంగా హైదరాబాద్ అదనపు సీపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘కొత్త MV చట్టం ప్రకారం కోర్టులు కూడా నిందితులకు జరిమానాలు విధించవచ్చన్నారు. ఎందుకంటే మద్యం తాగి వాహనం నడపడం నేరం కాబట్టి.. మద్యం తాగి వాహనం నడిపినందుకు పట్టుబడిన ప్రతి నేరస్థుడిపై కోర్టులు రూ.10,500 జరిమానా’ విధించాయని ఆయన పేర్కొన్నారు.