పోయిన బైక్‌కి ఇంటికి చలానా వచ్చింది..ఆ తర్వాత సీన్ అదరహో..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రాఫిక్ చలానా వేస్తే వాహనదారులు అగ్గిమీద గుగ్గిళం అవతున్నారు. ఫైన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. అయితే హైదరాబాద్‌లో ఓ టూవీలర్ హోల్డర్ ఫైన్ వేసినందుకు పోలీసులకు పదే, పదే థ్యాంక్స్ చెబతున్నాడు. ఎందుకంటారా..అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. బైక్ దొంగలను పట్టుకునేందుకు చలానాలు సాలిడ్‌గా ఉపయోగపడుతున్నాయి. నగరంలోని ఓల్డ్ సిటీలో ఓ బైక్ దొంగ ఇలానే బుక్కయ్యాడు. ప్రస్తుతానికి అతడి నుంచి 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. […]

పోయిన బైక్‌కి ఇంటికి చలానా వచ్చింది..ఆ తర్వాత సీన్ అదరహో..
Follow us

|

Updated on: Feb 04, 2020 | 12:05 PM

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రాఫిక్ చలానా వేస్తే వాహనదారులు అగ్గిమీద గుగ్గిళం అవతున్నారు. ఫైన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. అయితే హైదరాబాద్‌లో ఓ టూవీలర్ హోల్డర్ ఫైన్ వేసినందుకు పోలీసులకు పదే, పదే థ్యాంక్స్ చెబతున్నాడు. ఎందుకంటారా..అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. బైక్ దొంగలను పట్టుకునేందుకు చలానాలు సాలిడ్‌గా ఉపయోగపడుతున్నాయి. నగరంలోని ఓల్డ్ సిటీలో ఓ బైక్ దొంగ ఇలానే బుక్కయ్యాడు. ప్రస్తుతానికి అతడి నుంచి 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్ సిటీలోని మైలార్‌దేవ్ పల్లికి నివశించే మహమ్మద్ అఫ్రిదీ అఫ్జల్( 19).. వీడియో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. వివిధ ఫంక్షన్‌ హాల్స్‌లో కవరేజ్ కోసం వెళ్తుంటాడు. అయితే అక్కడికి వచ్చిన బైక్స్‌పై ఓ కన్ను వేస్తాడు అఫ్జల్. అదునుచూసి వాటిని తస్కరించి..సెకండ్ హ్యాండ్‌లో అమ్మెస్తాడు. ఈజీగా డబ్బులు వస్తుండటంతో గత కొంతకాలంగా దీన్నే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు ఈ టీనేజర్. అయితే ఇన్ని పాపాలు చేస్తుంటే విధి అంత ఈజీగా వదిలేస్తుందా..?. వాహనాలు సెకండ్ హ్యాండ్‌లో కొన్నవాళ్లు ట్రాఫిక్ చలానాలు కట్టడం లేట్ చేశారు. ఆ ఫైన్స్..ఫోటోలతో సహా ఓనర్ ఇంటికి వచ్చేశాయి. ఇంకేముంది..సదరు ఫ్రూప్స్‌తో పోలీస్ స్టేషన్‌లో వాలిపోయాడు అసలు ఓనర్. తీగ లాగితే డొంకంతా కదిలింది. నిందితుడు అప్జల్ బాగోతం బయటపడటంతో..అతడిని అదుపులోకి తీసుకున్నారు హుస్సేనిఆలం పోలీసులు.