IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 36 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ!
Ias

Updated on: Jun 12, 2025 | 10:19 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 36 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన వివరాలు చూసుకుంటే.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించింది ప్రభుత్వం, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించగా, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను నియమించింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను బదిలీ చేసింది, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ బాధ్యతలను అప్పగించింది, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరికి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే శంకరయ్యను నియమించగా, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును బాధ్యతలు అప్పగించింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా నవీన్‌ నికోలస్‌, సమాచార శాఖ కమిషన్‌ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా కిల్లు శివకుమార్‌ నాయుడును బదిలీ చేయగా, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మిని నియమించింది, మహిళా-శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సృజనకు అదనపు బాధ్యతలు అప్పగించగా, నిజామాబాద్‌ కలెక్టర్‌గా టీ వినయ్‌ కృష్ణారెడ్డిని నియమించింది, వ్యవసాయ సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్‌ శివశంకర్‌కు బాధ్యతలు కట్టబెట్టింది.

ఇక విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా శివశంకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్‌కు అదనపు బాధ్యతలు కట్టబెట్టగా.. సిద్దిపేట కలెక్టర్‌గా కే హైమావతిని నియమించింది, సింగరేణి డైరెక్టర్‌గా పీ గౌతమ్‌ను బదిలీ చేసింది. మత్స్యశాఖ డైరెక్టర్‌గా కే నిఖిల, పర్యటకశాఖ ఎండీగా వల్లూరి క్రాంతి, ఆరోగ్యశ్రీ హెల్త్‌ ట్రస్ట్‌ సీఈవోగా పీ ఉదయ్‌ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల, సంగారెడ్డి కలెక్టర్‌గా పీ ప్రావీణ్యను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ డైరెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్‌రెడ్డిని నియమించగా, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరికి బాధ్యతలు అప్పగించింది, ఖమ్మం కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టి, హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్‌ను నియమించింది, పౌర సరఫరాలశాఖ డైరెక్టర్‌గా ముజామిల్‌ ఖాన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..