Land Auction : భూముల అమ్మకం పూర్తి పారదర్శకం.. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా : సర్కారు 6 పేజీల వివరణ

|

Jul 20, 2021 | 6:34 PM

హైదరాబాద్ లోని కోకాపేట్, ఖానామెట్‌ భూముల వేలం పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ భూముల వేలంకు సంబంధించి వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం..

Land Auction : భూముల అమ్మకం పూర్తి పారదర్శకం.. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా : సర్కారు 6 పేజీల వివరణ
Kokapet Lands
Follow us on

Govt on Land Auction: హైదరాబాద్ లోని కోకాపేట్, ఖానామెట్‌ భూముల వేలం పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ భూముల వేలంకు సంబంధించి వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం 6 పేజీల ప్రకటనతో పూర్తిస్థాయి వివరణ ఇచ్చింది. భూముల వేలంపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని.. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ తాము నియంత్రించలేదని పేర్కొంది. ఎవరైనా ఒక బిడ్‌ను ప్రభావితం చేస్తారనేది పూర్తిగా అపోహేనని ప్రభుత్వ కొట్టిపారేసింది.

భూముల వేలంకు సంబంధించి ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించామని, 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్‌ ఖరారు చేశామని ప్రభుత్వం తెలిపింది. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యం లేదన్న ప్రభుత్వం.. భూముల వేలానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి సరికాదంది. ఈ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుందని తెలిపింది. వేలం గురించి నెల రోజులుగా ప్రచారం చేస్తున్నామని తెలిపిన సర్కారు.. పోటీని నివారించి, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తామని తన ప్రకటనలో పేర్కొంది.

Page One

Page Two