Telangana Election: ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్.. టాప్ 9 అప్‌డేట్స్ ఇవిగో..

|

Nov 30, 2023 | 9:42 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల ముందు నుంచే బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండగా..

Telangana Election: ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్.. టాప్ 9 అప్‌డేట్స్ ఇవిగో..
The Election Commission Has Reveals The Details Of The District Wise Polling Percentage In Telangana
Follow us on
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల ముందు నుంచే బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండగా.. మరికొన్ని చోట్ల సజావుగా పోలింగ్ కొనసాగుతోంది.

  • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ హీరో అల్లు అర్జున్. ఉదయం 7గంటలకే క్యూలో నిలబడి పోలింగ్ కేంద్రానికి రాగా… ఈవీఎం మొరాయించింది. కాసేపు వెయిట్ చేసి…ఆ తర్వాత ఓటు వేసి వెళ్లారు అల్లు అర్జున్.

  • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూలులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు నటుడు ఎన్టీఆర్. అందరితో పాటు క్యూలో నిలబడి మరీ ఓటు వేసిన ఎన్టీఆర్..ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

  • కూకట్‌ పల్లి వివేకానంద నగర్ లో కుటుంబ సమేతంగా వచ్చి తమఓటు హక్కు వినియోగించుకున్నారు శేరిలింగంపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు గాంధీ.

  • కూకట్‌పల్లి నియోజకవర్గం శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కును వినియోగించుకున్న కూకట్‌పల్లి ఎమ్మేల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు

  • సూర్యాపేట బూత్ నంబర్ 89లో evm మొరాయించింది. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి మాజీమంత్రి దామోదర్ రెడ్డి ఆ తర్వాత ఓటేసి వెళ్లారు.

  • సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని 215 పోలింగ్ స్టేషన్లలో కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి. కుత్భుల్లాపూర్‌లోని స్వగ్రామంలో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద. ప్రజలను చైతన్యం చేసి అందరూ ఓటేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు వివేకానంద.

  • ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సత్తుపల్లిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబ సభ్యులు.

  • వరంగల్ జిల్లా పర్వతగిరిలోని 265 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ తార్నాకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి రాంచందర్ రావు. పవిత్రమైన తమ ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకున్న తర్వాతనే బ్రేక్ పాస్ట్ చేయాలని సూచించారు రామచందర్ రావు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..