Telangana: అభివృద్ధి అంటే కేవలం రంగులు వేయడమే కాదు.. అంతకు మించి చేస్తాం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్య

|

May 27, 2022 | 5:25 PM

పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) అన్నారు. మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా...

Telangana: అభివృద్ధి అంటే కేవలం రంగులు వేయడమే కాదు.. అంతకు మించి చేస్తాం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్య
Sabita Indra Reddy
Follow us on

పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) అన్నారు. మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఆలియా పాఠశాలను మంత్రి సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్(CM KCR) కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చి దిద్దేలా చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి అంటే పాఠశాలలకు కేవలం రంగులు వేయడమే కాకుండా మౌలిక సదుపాయాలైన బిల్డింగ్స్, వాటర్, టాయిలెట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెడుతున్నామన్నారు. మనబడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ కు పంపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

విడతల వారీగా స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నిధులు కూడా కేటాయించాం. అభివృద్ధి అంటే స్కూల్‌కి కలర్ మాత్రమే వేయడం కాదు.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ఉండేలా తయారు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం అందిస్తున్నాం. ఇప్పటికే టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చాం. ఇబ్బందులు పడుతూ విద్యార్థులను ప్రైవేటు స్కూళ్లకు పంపొద్దు. పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకోవాలి.

       – సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి