Hyderabad: అర్థరాత్రి పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. హోర్డింగ్ టవర్ ఎక్కి హంగామా!

హైదరాబాద్ మహానగరంలో భార్య తిట్టిందని మద్యం మత్తులో యువకుడు అర్థరాత్రి హోర్డింగ్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు.

Hyderabad: అర్థరాత్రి పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. హోర్డింగ్ టవర్ ఎక్కి హంగామా!
Climbed Tower

Updated on: May 01, 2022 | 9:43 AM

Drunken man climbed hording tower: హైదరాబాద్ మహానగరంలో భార్య తిట్టిందని మద్యం మత్తులో యువకుడు అర్థరాత్రి హోర్డింగ్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. నర్సింగ్ గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హంగామా స‌ృష్టించాడు. తాజాగా రాత్రి 11 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కి మరోసారి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. చివరికి ఎలాగోలా బుజ్జగించి సురక్షితంగా కిందకు దించిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు,

గతంలో ఉద్యోగం కావాలని భార్య తిట్టి.. పుట్టింటికి వెళ్లి పోయిందంటూ టవర్ ఎక్కిన నర్సింగ్ నానా హంగామా సృష్టించాడు. చివరికి కుటుంబసభ్యులు సర్ధిచెప్పడంతో దిగివచ్చాడు. తాజాగా మరోసారి భార్య కోపడిందని మద్యం మత్తులో హోర్డింగ్ టవర్ ఎక్కేశాడు. మద్యం మత్తులో దూకుతా అంటూ బెదిరించాడు నర్సింగ్ రావు. అర్థగంట పాటు హంగామా చేశాడు. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాగుబోతును పోలీసులు కిందకు దింపేందుకు నానా అగచాట్లు పాడాల్సి వచ్చింది.

Read Also…. Madhya Pradesh: గర్జిస్తున్న బుల్డోజర్లు.. ఈసారి ఏకంగా మాజీ సీఎం ఉమాభారతి సన్నిహితుడి ఫ్లాట్ల కూల్చివేత!