తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా మూకమ్మడిగా గవర్నర్ తమిళిసైని(Governor Tamilisai) కలిసేందుకు వెళ్లారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎవరివారే సెపరేట్ రూట్ ఫాలో అయ్యే నేతలు కూడా ఈసారి అంతా ఒక్కటిగా రాజ్‌భవన్ గడప తొక్కారు. పీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు స్టార్ క్యాంపైర్ కోమటిరెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా వెళ్లారు. కాంగ్రెస్ నేతలంతా గవర్నర్ దగ్గరకి అనేక అంశాలపై ఏకరవు పెట్టారు. తెలంగాణలో ఇప్పటికే 40 శాతం పంట అమ్ముకున్నారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నిర్ణయం తీసుకుందన్నారు. ముందే అమ్మేసుకుని నష్టపోయిన రైతులకు పరిహారం డిమాండ్ చేస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. మరోవైపు విద్యుత్ చార్జీలు తగ్గించాలని, డిస్కమ్‌ల బకాయిలు వినియోదారులకు భారంకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక 111 జీవో ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిపై గవర్నర్ రివ్యూ చేపట్టాలని కోరారు. డ్రగ్స్,శాంతి భద్రతల కూడా సమీక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి చివరి ధాన్యపు గింజ కొనే వరకు పోరాటం ఆగదనారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికే ధాన్యం అమ్మేసి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారాయన. ప్రభుత్వాన్ని నమ్మి ఇతర పంటలు వేసి నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. 111 జీవోపై అఖిలపక్షం పెట్టాలన్నది ఎంపీ కోమటిరెడ్డి మరో డిమాండ్.
ఆ జీవో పరిధిలోని భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలని కోరతామన్నారు. మూసీ ప్రక్షాళనపై గవర్నర్‌కు వివరిస్తామని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గవర్నర్ వ్యవస్థను గౌరవించుకోవాలన్నారు కోమటిరెడ్డి. ప్రభుత్వాధికారుల చర్యల వల్ల దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోతోందన్నారు. గవర్నర్‌గా నరసింహన్ ఉన్నపుడు ఓ రకంగా.. ఇప్పుడు మహిళ కావడంతో సీఎం మరోరకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..
Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..