PM Modi on Hyderabad visit: ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) శనివారం హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో రామానుజచార్య సహస్రాబ్ధి (Ramanujacharya Sahasrabdi) వేడుకలతో పాటు పటాన్ చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( CM KCR) పాల్గొననున్నారు. తొలుత శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్‌కు చేరుకోనున్నారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ వెంటే ఉంటారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్, కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు, నాయకులు పాల్గొననున్నారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని సుమారు మూడు గంటల సేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రం విశిష్టతలను చిన జీయర్ స్వామి ప్రధాని నరేంద్ర మోడీకి సమగ్రంగా వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేసేలా ఏర్పాట్లు సైతం చేశారు.
ప్రధాని మోడీ ట్విట్..
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం శనివారం ఉదయం ట్విట్ చేసి వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్‌లో రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు వ్యవసాయం, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై పనిచేసే ICRISAT 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటానని తెలిపారు.
I look forward to being in Hyderabad today to take part in two programmes. At around 2:45 PM, I will join the 50th Anniversary celebrations of ICRISAT, an important institution that works on aspects relating to agriculture and innovation.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
షెడ్యూల్ ఇలా..
ఈ రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు డిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత 2.45 కి ఇక్రిశాట్ కు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4.30కు ముచ్చింతల్ కు చేరుకుంటారు. రామానుజచార్యుల సువర్ణ విగ్రహావిష్కరణ, ప్రసంగం తదితర కార్యక్రమాల అనంతరం రాత్రి 8.20 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. రామానుజచార్య సహస్రాబ్ధి వేడుకల్లో దాదాపు 3గంటల పాటు ప్రధాని మోడీ పాల్గొననున్నారు.
హై అలెర్ట్..
ప్రధాని మోడీ టూర్‌కు రాష్ట్ర పోలీసులు హై సెక్యూరిటీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 7వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు వచ్చి ప్రధాని.. రాత్రి దాదాపు 8 గంటల వరకు ఉంటారు. ఇప్పటికే భద్రతా చర్యలపై రాష్ట్ర పోలీసులతో ఎస్పీజీ సమన్వయం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పంజాబ్‌లో జరిగిన సెక్యూరిటీ ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకొని పలు చర్యలు చేపట్టారు. మోదీ వెళ్లే రోడ్స్‌ను ముందుగానే బ్లాక్ చేయనున్నారు.
Also Read: