దసరాకు కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా ఆ ముగ్గురు కన్ఫర్మ్..!

| Edited By:

Aug 28, 2019 | 7:45 AM

తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. దీంతో కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దసరా లోపు మొదటి దఫాలో కేబినెట్‌ను విస్తరించనున్నట్లు సమాచారం. అలాగే సంక్రాంతి లోపు రెండో దఫాలో కేబినెట్ విస్తరణ జరగనుందని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో సీఎం సహా 12మంది ఉండగా.. మరో ఆరుగురికి కేసీఆర్ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో తొలి విడతలో ముగ్గురిని, రెండో విడతలో మరో ముగ్గురిని […]

దసరాకు కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా ఆ ముగ్గురు కన్ఫర్మ్..!
Follow us on

తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. దీంతో కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దసరా లోపు మొదటి దఫాలో కేబినెట్‌ను విస్తరించనున్నట్లు సమాచారం. అలాగే సంక్రాంతి లోపు రెండో దఫాలో కేబినెట్ విస్తరణ జరగనుందని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో సీఎం సహా 12మంది ఉండగా.. మరో ఆరుగురికి కేసీఆర్ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో తొలి విడతలో ముగ్గురిని, రెండో విడతలో మరో ముగ్గురిని తీసుకుంటారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక ముహూర్తాలు బావుంటే.. దసరా కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే మరోవైపు కేసీఆర్ కేబినెట్‌లో స్థానం కోసం ఎంతోమంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. వారిలో కొంతమందికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఇక వీరితో పాటు దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్దన్, వినయ్ భాస్కర్, జోగు రామన్న, గంగుల కమలాకర్, నన్నపనేని నరేందర్, సత్యవతి రాథోడ్, హరిప్రియ నాయక్, సబితా రెడ్డి, అజయ్ కుమార్, మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ, రేగ కాంతిరావు తదితరులు ఉన్నారు. సామాజిక వర్గాలు, మహిళా కోటాలో వీరిలో కొంతమందికి మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉంది.