తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ, హరీష్ రావు, కేటీఆర్ కు చోటు, ఓ మహిళా నేతకు అవకాశం అంటూ..ఇటు టీఆర్ఎస్ తో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తికలిగిస్తోంది. అన్ని కుదిరితే ఆగస్టులోనే విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. కేసీఆర్ తో పాటు కొంత మంది మంత్రులే ఉన్నారు. మంత్రి వర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, పార్టీ మారిన నేతల ఒత్తిడి,సామాజిక సమీకరణాలు ఇలా విస్తరణకు చాలా అంశాలు పరిశీలించాల్సి వస్తోదంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
ఇప్పటికే హరీష్ రావు అంశం పార్టీలో ఇష్యూగా మారడంతో ఆయనకు తప్పనిసరి బెర్త్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కేటీఆర్ కు కన్ఫామ్. వీళ్లతో పాటు మహిళా కోటాలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి, సీనియర్ హోదాలో తుమ్మలకు చోటు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కేబినెట్ లో 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉన్నా…ప్రస్తుతానికి ఈ నలుగురితోనే సరిపెట్టే అవకాశం ఉందట. గ్రేటర్ హైదరాబాద్ సహా,
మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత మరో ఇద్దరికి చోటు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట కేసీఆర్.