Corona Virus: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా రక్కసి.. అనాథాశ్రమంలో 45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్..

|

Apr 05, 2021 | 6:19 PM

Corona Virus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది.

Corona Virus: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా రక్కసి.. అనాథాశ్రమంలో 45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్..
Corona Positive
Follow us on

Corona Virus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్యం విపరీతంగా పెరుగుతోంది. గతేడాది కంటే కూడా అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో గల చిత్ర లేఅవుట్‌లోని అనాథాశ్రమంలో 45 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విద్యార్థులు పలువురు జ్వరం సహా కోవిడ్ లక్షణాలతో బాధపడుతుండగా.. అనాథాశ్రమం నిర్వాహకులు వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 45 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను లేఅవుట్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గల గదుల్లో ఐసోలేషన్‌కు పంపించారు. కాగా, ఈ అనాథాశ్రమంలో సుమారు వంద మంది పిల్లలు నివసిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మిగతా వారికి కూడా కరోనా టెస్టులు చేయిస్తున్నట్లు తెలిపారు. వీరికి సంబంధించిన ఫలితాలు వెల్లడించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

ఇదిలాఉండగా.. నిజామాబాద్‌ జిల్లాలో 86 మంది కరోనా బారిన పడ్డారు. ఓ వివాహ వేడుకకు హాజరైన వీరికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వివాహ వేడుకలో సుమారు 320 మంది పాల్గొనగా.. వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కల్పించాయి. దాంతో వారు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్యులు వారిని కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. దాంతో ఆ వివాహ వేడుకలో పాల్గొన్న వారందరికీ కరోనా టెస్ట్ చేయగా.. 86 మందికి పాజిటీవ్ తేలింది. ఇక జగిత్యాల జిల్లాలోనూ కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. జిల్లాలోని ఓ గ్రామంలో ఏకంగా 27 మందికి కరోనా సోకింది. దాంతో ఆ గ్రామంలో లాక్‌డౌన్ విధించారు.

Also read:

Maoist Release a Letter: మావోయిస్టుల మరో ఎత్తుగడ.. మొన్న విధ్వంసం..నేడు మరో కొత్త ప్లాన్‌తో కేంద్రానికి లేఖ..

Chhattisgarh Naxal Attack: సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ఏపీ అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున సాయం..

నిల్వ ఉంటాయని.. వీటిని ఫ్రిడ్జి లో పెడుతున్నారా… అవి విషం కంటే ప్రమాదమట..అవేంటో తెలుసుకోండి..!