Hyderabad: పైశాచికం.. వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్స్

మనిషి కిరాతకం ఇలా కూడా ఉంటుందా? పైశాచిక ఆనందం ఈ స్థాయిలో ఉంటుందా? ఈ ఘటన చూస్తే.. మనకు ఇలాంటి సందేహాలు రాక తప్పదు. హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన దారుణ ఘటన గురించి తెలిస్తే మీకు కూడా ఈ సమాజం పట్ల జుగుప్ప కలుగుతుంది. 

Hyderabad: పైశాచికం.. వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్స్
Women Murder

Edited By: Ram Naramaneni

Updated on: Apr 15, 2025 | 9:31 AM

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్సులు చేశాడు ఓ టీనేజర్. మళ్లీ దారుణాన్ని సెల్ఫీ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన నగరంలో ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

వృద్ధురాలు కమలాదేవికి చెందిన షాపులో రెంటుకు ఉంటున్నాడు ఆ టీనేజర్.  అద్దె  సరిగ్గా కట్టకపోవడంతో.. అతడ్ని ఆమె మందలించింది. దీంతో కక్ష కట్టి ఏప్రిల్  11వ తేదీన ఆమెపై ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత చీరతో ఆమెను తలను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీయడానికి ప్రయత్నించాడు.

చీరతో ఆమె తలను సీలింగ్ ఫ్యాన్‌కు కట్టి, తన సెల్ ఫోన్ కెమెరాను ఆన్ చేశాడు. మంచం మీద పాక్షికంగా వంగి ఉన్న ఆమె మృతదేహంపై డ్యాన్స్ చేసి, ఒక నిమిషం నిడివి గల వీడియోను రికార్డ్ చేశాడు. ఆ తర్వాత, తలుపు లాక్ చేసి, తాళం అక్కడే పడేసి వెళ్లిపోయాడు” అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఏప్రిల్ 13వ తేదీ రాత్రి బెంగళూరులో నివసించే బాధితురాలి బంధువుకు నిందితుడు స్వయంగా ఫోన్ చేసి హత్య విషయాన్ని తెలియజేశాడు. అవతలి వ్యక్తి నిందితుడు చెప్పిన విషయాన్ని నమ్మలేదు. దీంతో మృతదేహంపై డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. బెంగళూరుకు చెందిన మృతురాలి బంధువు ఏప్రిల్ 14న కుషాయిగూడలోని లోకల్‌గా తెలిసిన వ్యక్తికి ఈ సమాచారాన్ని తెలియజేశాడు.  అతను పోలీసులకు సమాచారం అందించాడు.

” మేం వెళ్లేసరికి.. ఇంటి నుండి దుర్వాసన వస్తోంది. మా టీమ్ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. శవపరీక్ష కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించాం” అని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి తెలిపారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన కృష్ణపాల్ సింగ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన 70 ఏళ్ల కమలా దేవిగా గుర్తించారు. మూడు దశాబ్దాల క్రితం, కమలా దేవి తన భర్తతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చింది. కమలా భర్త 15 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆమె ప్రస్తుతం కృష్ణ నగర్‌లోని 5వ వీధిలోని వారి ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..