Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తప్పిన ప్రమాదం.. రన్ వే పై నిలిచిన ఫ్లైబిగ్ ఫ్లైట్

|

May 29, 2022 | 4:38 PM

హైదరాబాద్(Hyderabad) నగర శివారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్‌(Flybig Plane) విమానం రన్‌వే....

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తప్పిన ప్రమాదం.. రన్ వే పై నిలిచిన ఫ్లైబిగ్ ఫ్లైట్
Flybig
Follow us on

హైదరాబాద్(Hyderabad) నగర శివారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్‌(Flybig Plane) విమానం రన్‌వే పైకి వెళ్లగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌ వే పై నిలిచిపోయింది. ఈ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉదయం నిలిచిపోయిన విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు అధికారులపై అసహం వ్యక్తం చేశారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు ధర్నా చేశారు.ఇదిలా ఉంటే.. నేపాల్‌లో 22 మందితో వెళ్తోన్న తార ఎయిర్‌లైన్స్‌ విమానం అదృశ్యం అయింది. ఈ ఫ్లైట్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (ఏటీసీ) సంబంధాలు తెగిపోయాయని అధికారులు ప్రకటించారు. దీంతో విమానం ఎక్కడ ఉందో తెలియడం లేదు.

ఈ విమానంలో 22 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు భారయతీయులు ఉన్నారు. చివరిసారి ఈ విమానం ఉదయం 9:55 గంటలకు ఏటీసీతో టచ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముస్తాంగ్ జిల్లాలోని జోమ్‌సోమ్ ఆకాశంలో విమానం కనిపించిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత మౌంట్ ధౌలగిరికి వైపు వెళ్లిందని.. ఆ తర్వాత దానితో సంబంధాలు తెగిపోయినట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి