Hyderabad: రద్దీ ప్రాంతంలో అనుమానస్పదంగా సూట్‌కేస్.. పోలీసులు ఓపెన్‌ చేసి చూడగా..

హైదరాబాద్‌లోని కోఠి ఆంధ్రా బ్యాంక్‌ చౌరస్తాలో ఓ సూట్‌కేసు కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చౌరస్తాలో సూట్‌కేసును ఉంచి వెళ్లిపోయారు. అత్యంత రద్దీ ఉండే ప్రాంతం, దుకాణాలతో నిత్యం జనాలు కిటకిటలాడే ప్రదేశం కావడంతో...

Hyderabad: రద్దీ ప్రాంతంలో అనుమానస్పదంగా సూట్‌కేస్.. పోలీసులు ఓపెన్‌ చేసి చూడగా..
Representative Image

Updated on: Apr 17, 2023 | 3:10 PM

హైదరాబాద్‌లోని కోఠి ఆంధ్రా బ్యాంక్‌ చౌరస్తాలో ఓ సూట్‌కేసు కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చౌరస్తాలో సూట్‌కేస్ ఉంచి వెళ్లిపోయారు. అత్యంత రద్దీ ఉండే ప్రాంతం, దుకాణాలతో నిత్యం జనాలు కిటకిటలాడే ప్రదేశం కావడంతో ఒక్కసారిగా అందరు ఉలిక్కిపడ్డారు. సూట్‌కేస్ వాలకం అనుమానంగా ఉండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సూట్‌కేస్ లో ఏదైనా పేలుడు పదార్థాలు ఉండొచ్చన అనుమానంతో బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత సూట్‌కేస్ ను తెరిచారు. అయితే ఆ సూట్‌కేస్ లో బట్టలు, పెర్ఫ్యూమ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే సూట్‌కేస్ లో ఉన్న వస్తువుల ఆధారంగా అది ఓ మహిళకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..