Hyderabad: జానీ మాస్టర్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన..

|

Nov 23, 2024 | 12:13 PM

లైంగింక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది..

Hyderabad: జానీ మాస్టర్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన..
Jhony Master
Follow us on

సినిమా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు సుప్రీం కోర్ట్‌ ఊరటనిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన జానీ మాస్టర్‌కు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలన్న అంశంపై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

తనను లైంగికంగా వేధించారంటూ తోటి మహిళా కొరియోగ్రాఫర్‌ జామీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేయగా ఆయన బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 37 రోజుల పాటు జైల్లో ఉన్న జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్‌ 24వ తేదీన బెయిల్‌ను అందించారు. అయితే తాజాగా బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విషయమై జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీష్‌చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్‌ చేసింది.

ఇదిలా ఉంటే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత తొలిసారి జానీ మాస్టర్‌ ఇటీవల పబ్లిక్‌గా మాట్లాడారు. జబర్దస్త్‌ రాకేష్‌ నటించిన ‘కేసీఆర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన జానీ మాస్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి.. ఇలా జరిగినప్పుడు బయటకు ఎవ్వరూ రారు.. నన్ను నమ్మిన ప్రతీ ఒక్కరికీ.. ఇంట్లో బిడ్డలా అనుకుని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు.. త్వరలోనే అన్నీ తెలుస్తాయ్’ అని ఎమోషన్‌ అయ్యారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..