Hyderabad: బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం.. ట్యాంకర్ ఢీకొని ర్యాపిడో డ్రైవర్, యువతి మృతి!

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లో వేగంగా దూసుకొచ్చిన ఓ వాటర్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు హోంగార్డు సయ్యద్, యువతి అక్షితగా గుర్తించారు.

Hyderabad: బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం.. ట్యాంకర్ ఢీకొని ర్యాపిడో డ్రైవర్, యువతి మృతి!
Hyderabad Road Accident

Updated on: Feb 23, 2026 | 4:00 PM

హైదరాబాద్‌ నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 45లో ఓ ఫెరారీ కారు బీభత్స సృష్టించిన 3 కార్లు ధ్వంసమైన ఘటన మరువక ముందే నగరంలో మరో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. బంజారాహిల్స్‌లో వేగంగా దూసుకొచ్చిన ఓ వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతీ, యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మృతులు సంతోష్‌నగర్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్, విజయనగరం జిల్లాకు చెందిన యువతి అక్షితగా గుర్తించారు. అయితే సయ్యద్‌ సంతోష్‌నగర్‌ పీఎస్‌లో ట్రాఫిక్‌ హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తూ, డ్యూటీ తర్వాత రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం సయ్యద్ ర్యాపిడో చేసేందుకు బయల్దేరాడు. అక్షిత అనే యువతి నుంచి బుకింగ్ రావడంతో ఆమెను ఎక్కించుకొని బైక్‌పై బయల్దేరాడు.

సరిగ్గా బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10 సమీపంలోకి రాగానే వేగంగా దూసుకొచ్చిన ఓ వాటర్‌ ట్యాంకర్‌ వెనక నుంచి సయ్యద్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్షిత, సయ్యద్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us