Railway News: ప్రయాణికులకు శుభవార్త.. రద్దీ దృష్ట్యా తిరుపతికి ప్రత్యేక రైళ్లు..

|

Nov 12, 2022 | 8:50 PM

ప్రయాణికుల సౌకర్యార్థం, రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా..

Railway News: ప్రయాణికులకు శుభవార్త.. రద్దీ దృష్ట్యా తిరుపతికి ప్రత్యేక రైళ్లు..
Special Trains
Follow us on

ప్రయాణికుల సౌకర్యార్థం, రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా కాచిగూడ – తిరుపతి, కాచిగూడ – నర్సాపూర్ ల మధ్య రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ రైళ్లు ఎప్పుడు బయలు దేరనున్నాయి, ఈ స్పెషల్‌ ట్రైన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

* కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే 07483 నెంబర్‌ ట్రైన్‌ ఆదివారం 19.25కి బయలు దేరి సోమవారం 09.30కి తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ 13-11-2022న బయలు దేరుతుంది.

* తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే 07484 నెంబర్‌ ట్రైన్‌ సోమవారం 20.10 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి మంగళవారం 09.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ తిరుపతి నుంచి 14-11-2022 తేదీన బయలు దేరుతుంది.

ఇవి కూడా చదవండి

* కాచిగూడ నుంచి నర్సాపూర్ వెళ్లే 07612 నెంబర్‌ ట్రైన్‌ 20.30 మంగళవారం బయలు దేరి మరునాడు 08.00 (బుధవారం) నర్సాపూర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు 15-11-2022 తేదీన బయలుదేరుతుంది.

* కాచిగూడ- తిరుపతి – కాచిగూడ స్పెషల్‌ ట్రైన్‌ మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నదికుడే, సత్తెన్నపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది.

* ఇక కాచిగూడ – నర్సపూర్‌ల మధ్య ప్రయణించే స్పెషల్‌ ట్రైన్‌ మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్స్‌లో ఆగుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..