Summer Special Trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వేసవి ప్రత్యేక రైళ్ల ప్రకటించిన ద.మ.రైల్వే

|

Feb 17, 2023 | 2:05 PM

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు వేసవి ప్రత్యేక రైళ్లను పెంచుతూ వస్తోన్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Summer Special Trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వేసవి ప్రత్యేక రైళ్ల ప్రకటించిన ద.మ.రైల్వే
Summer Special Trains
Follow us on

సమ్మర్‌ హాలీడేస్‌లో చాలామంది సొంతూళ్లకు వెళ్లాలనుకుంటారు. ఇంకొందరు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. మరికొందరు చల్లని వాతావరణం కలిగిన వేసవి విడిది లొకేషన్స్‌కు వెళ్లాలనుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఏటా ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలా ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో సమ్మర్‌ స్పెషల్‌ రైలు సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. కాగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు వేసవి ప్రత్యేక రైళ్లను పెంచుతూ వస్తోన్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. తిరుపతి- అకోలా (07605), అకోలా- తిరుపతి (07606), పూర్ణ- తిరుపతి (07607), తిరుపతి-పూర్ణ (07608), హైద్రాబాద్‌- నర్సాపూర్‌(07631), నర్సాపూర్‌- హైద్రాబాద్‌(07632), హైద్రాబాద్‌- తిరుపతి (07643), తిరుపతి-హైద్రాబాద్‌ (07644), విజయవాడ- నాగర్‌ సోయిల్‌ (07698), నాగర్‌ సోయిల్‌- విజయవాడ(07699) ట్రైన్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించారు.

అలాగే కాకినాడ- లింగంపల్లి (07445), లింగం పల్లి- కాకినాడ (07446), మచిలీపట్నం- సికింద్రాబాద్‌ (07185), సికింద్రాబాద్‌- మచిలీపట్నం (07186), తిరుపతి- సికింద్రాబాద్‌ (07481), సికింద్రాబాద్‌- తిరుపతి (07482), మచిలీపట్నం- తిరుపతి (07095), తిరుపతి- మచిలీపట్నం (07096) రైళ్లను కూడా జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..