Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో అత్యాచారం..!

|

Oct 15, 2024 | 3:09 PM

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో అత్యాచారం..!
Crime News (Representative image)
Follow us on

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆమె ఎక్కిన ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. ఆ తర్వాత డ్రైవర్ దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై డ్రైవర్ ఆటోలోనే అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.. అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పోయాడని తెలిపింది.

యువతి అమీర్‌పేటలోని ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేస్తుందని సమచారం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

కాగా.. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..