Telangana: పోలీసులపైనే దాడికి దిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. ఆ తర్వాత సీన్ రివర్స్..

| Edited By: Velpula Bharath Rao

Oct 26, 2024 | 8:49 AM

పోలీసులపైనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు దాడికి చేశారు. హైదరాబాదులో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కలిసి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. చిన్న గొడవ కాస్త పెద్దిదిగా మారి ఎంత దారికి తీసిందో తెలుసా? ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసులు ఏం చేశారు?

Telangana: పోలీసులపైనే దాడికి దిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. ఆ తర్వాత సీన్ రివర్స్..
Software Engineers Attached
Follow us on

హైదరాబాదులో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కలిసి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఆఫీస్ ముగిసిన తర్వాత ఒక పార్టీకి వెళ్లిన ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీంతో స్థానికులు వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికులతో వారు గొడవకు దిగారు. దీంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే స్పాట్‌కు వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను వారించే ప్రయత్నం చేశారు. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా వారిని కోరారు. అయినప్పటికీ వారు అలానే రోడ్డుపై వచ్చిపోయే వారికి విఘాతం కలిగిస్తుండటంతో పోలీసులు ముగ్గురు యువకులను బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. తమ మీద చేయి వేస్తావా అంటూ ముగ్గురు కలిసి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డుపై ముగ్గురు సాఫ్ట్‌వేర్‌  ఇంజనీర్లు వాగ్వాదానికి దిగి వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు కోలుకున్న తర్వాత ముగ్గురు సాఫ్ట్‌వేర్‌  ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు

అరెస్ట్ అయిన వారిలో అశోక్, మోహన్, కార్తీక్‌‌గా గుర్తించారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌  కంపెనీలో వీరందరూ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. గురువారం  జూబ్లీహిల్స్‌లోని శాలివాహన నగర్లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఈ ఘటన జరగటంతో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు చంచల్‌గూడలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి