Bonalu 2021 ; అనారోగ్యంతో ఉన్న వారెవ‌రూ ఆల‌యాల‌కు రావొద్ద‌ు.. బోనాల వేడుక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలి : సీపీ అంజ‌నీ కుమార్

|

Jun 29, 2021 | 10:02 PM

హైద‌రాబాద్‌లో బోనాలు ప్ర‌శాంతంగా జ‌రిగేలా ఏర్పాట్లు చేయాల‌ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ అధికారులు, పోలీసుల‌ను ఆదేశించారు...

Bonalu 2021 ; అనారోగ్యంతో ఉన్న వారెవ‌రూ ఆల‌యాల‌కు రావొద్ద‌ు..  బోనాల వేడుక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలి : సీపీ అంజ‌నీ కుమార్
Bonalu
Follow us on

CP Anjani Kumar : హైద‌రాబాద్‌లో బోనాలు ప్ర‌శాంతంగా జ‌రిగేలా ఏర్పాట్లు చేయాల‌ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ అధికారులు, పోలీసుల‌ను ఆదేశించారు. పోలీసుల‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. బోనాల వేడుక‌ల్లో కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని, అనారోగ్యంతో ఉన్న వారెవ‌రూ ఆల‌యాల‌కు రావొద్ద‌ని సూచించారు. జూలై 11న గోల్కొండ కోటపైనున్న జగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి బోనం పూజతో ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు దేవాదాయశాఖ అధికారులు, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బోనాల పండుగ వివరాలు :

 > జూలై 11న గోల్కొండ బోనాలు /అమ్మవారివారి ఘటోత్సవం
> జూలై 25న సికింద్రాబాద్‌ (లష్కర్‌) బోనాలు
> జూలై 26న రంగం
> ఆగస్టు 1న హైదరాబాద్‌ (పాతబస్తీ) బోనాలు

Read also : Bonalu Festival: బోనాల నిర్వహణపై మంత్రుల సమీక్ష.. కీలక ఆదేశాలు