సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. ఈ ట్రైన్ సమయాల్లో కొన్ని మార్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ షెడ్యూల్ మార్పు కేవలం ఒక్క రోజు i.e., మే 23వ తేదీ(మంగళవారం) మాత్రమేనని వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 20834 ట్రైన్.. ఇవాళ అనగా మే 23న సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరుతుందన్నారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ రోజు ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవల్సిందిగా రైల్వే అధికారులు కోరారు.
కాగా, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రైల్వే అధికారులు అన్నారు. 100 కంటే ఎక్కువ శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని.. అటు సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలులో కూడా ఇదే రీతిలో ఆక్యుపెన్సీ జరుగుతోందని తెలిపారు.
*Rescheduling of Secunderabad – Visakhapatnam Vande Bharat Express today*
Train No. 20834 Secunderabad – Visakhapatnam Vande Bharat Express scheduled to depart Secunderabad at 15.00 hrs today i.e., 23.05.2023 is rescheduled to depart at 16.15 hrs on the same day.
— South Central Railway (@SCRailwayIndia) May 23, 2023