Drainage deaths: డ్రైనేజీలో గల్లంతైన మరో కార్మికుడి కోసం కొనసాగుతోన్న గాలింపు, 24 గంటలు దాటినా దొరకని ఆచూకీ

|

Aug 04, 2021 | 10:37 PM

హైదరాబాద్ వనస్థలిపురం డ్రేనేజిలో కొట్టుకపోయి, విషవాయులతో సమాధి అయిన ఇద్దరు కార్మికుల్లో మరొకరి మృతదేహం ఇంకా దొరకలేదు. 24గంటలు గడచినా అచూకీ లేకపోవడం విశేషం

Drainage deaths:  డ్రైనేజీలో గల్లంతైన మరో కార్మికుడి కోసం కొనసాగుతోన్న గాలింపు, 24 గంటలు దాటినా దొరకని ఆచూకీ
Man Falls In Drain
Follow us on

Vanasthalipuram Drainage incident: హైదరాబాద్ వనస్థలిపురం డ్రేనేజిలో కొట్టుకపోయి, విషవాయులతో సమాధి అయిన ఇద్దరు కార్మికుల్లో మరొకరి మృతదేహం ఇంకా దొరకలేదు. 24గంటలు గడచినా అచూకీ లేకపోవడం విశేషం. డెడ్ బాడీ డ్రైనేజీలో కొట్టుకపోయిందని అధికారులు అనుమానిస్తున్నారు.

కాగా, డ్రైనేజీ క్లీనింగ్‌ కోసం వెళ్లి ఊపిరాడక ఇద్దరు చనిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్ లో ఈ ఘటన జరిగింది. రాత్రి 11 గంటల తర్వాత డ్రైనేజీ క్లీనింగ్‌ పనులు చేపట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది.

వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌లో డ్రైనేజీ క్లీనింగ్‌ చేసేందుకు లోనికి దిగారు అంతయ్య, శివ. అయితే లోనికి దిగిన కొద్దిసేపటికే వీరిద్దరు గల్లంతు కావడంతో శివ మృతదేహాన్ని సిబ్బంది బయటకి తీశారు. అంతయ్య డెడ్‌బాడీ కోసం గాలిస్తున్నారు. మృతులను చంపాపేట్‌, సరూర్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిగా పనిచేస్తున్నారు.

సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా రాత్రి 11 గంటల తర్వాత డ్రైనేజీ క్లీనింగ్‌ పనులు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు పారిశుద్ధ్య పనులతోనే తమకు జీవనోపాధి లభిస్తుందని, మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

రాత్రి వేళలో డ్రైనేజీ క్లీనింగ్‌ పనులు చేయాలని ఒత్తిడి తెచ్చిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బిఎన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read also: Pensions: కొత్త పెన్షన్ల కోసం జీఓ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అర్హులైన 57 ఏళ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు