Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు

|

Sep 11, 2021 | 2:50 PM

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్లో కీలక అంశాలను JNTU ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేశారు. యాక్సిడెంట్ జరుగుతుందని

Sai Dharam Tej: సాయి  ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు
Untitled 1
Follow us on

Tollywood Hero Sai Dharam Tej: టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్లో కీలక అంశాలను JNTU ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేశారు. యాక్సిడెంట్ జరుగుతుందని ఎర్లీ రియాక్షనే సాయి ధరమ్ తేజ్‌ ప్రమాదానికి కారణం అయివుంటుందని నిఫుణులు అభిప్రాయానికి వచ్చారు. ప్రమాద విజువల్స్ ను పరిశీలించిన అనంతరం JNTU చీఫ్ ఇంజనీర్, డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణరావు బృందం ఈ అభిప్రాయానికి వచ్చింది.

డ్రైవింగ్ లో సెన్సిటివిటీ, స్టబిలిటీ రెండూ బ్యాలన్స్ చేసుకోవాలని.. రోడ్డుపై ఉన్న పరిస్థితులు గమనించి సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షన్ వల్ల బైక్ బోల్తా కొట్టి ఉంటుందని నిఫుణుల బృందం పేర్కొంది. ఒక ప్రమాదాన్ని గుర్తించడానికి ఎన్ని సెకండ్ల సమయం ఉంటుంది.. వయసును బట్టి ప్రమాద సమయాల్లో బ్రేక్ వేసే టైం ఉంటుందని చీఫ్ ఇంజనీర్‌ టీవీ9కు వెల్లడించారు.

కాగా, మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ కు గాయాలవడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపు త‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు గాయాల‌య్యాయి.

దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి ప్రథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి చేరుకున్నారు.

తేజ్‌కు శుక్రవారం రాత్రి 7-30 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిందని .. ప్రస్తుతం కోలుకుంటున్నాడని మెగా ఫ్యామిలీ తరపున అల్లు అరవింద్ తెలిపారు. చికిత్స జరుగుతుందని.. అభిమానులు ఆందోళపడాల్సిన అవసరం లేదని అరవింద్ పేర్కొన్నారు.

కాగా, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై సినీ ఇండస్ట్రీ, మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని.. ఏపీ విజయవాడ వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థలో ప్రార్థలు కొనసాగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆశ్రమంలోని వృద్ధులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

అందరి బాగు కోరే ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిన అనంతరం అన్నం కూడా తినాలనిపించడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ఆశ్రమానికి రావాలంటూ ఆశ్రమంలోని వృద్ధులు కోరుతున్నారు.

కాగా.. విజయవాడలో అమ్మ ప్రేమ ఆదరణ వృద్దుల ఆశ్రమం నిర్మాణానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతంలో భారీగా విరాళం ఇచ్చారు. వృద్ధుల కోసం రెండంతస్తుల భవనం సైతం కట్టించారు. గతంలో సాయి ధరమ్ తేజ్ పలుమార్లు అమ్మ ప్రేమ ఆదరణ సేవా సమితి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అయితే.. సాయి ధరమ్ తేజ్ ఈ ప్రాంతానికి షూటింగ్ నిమిత్తం ఎప్పుడు వచ్చినా ఆశ్రమానికి వచ్చేవారంటూ ఆశ్రమం నిర్వాహకులు చెబుతున్నారు.

Read also: కూరగాయల రైతుకి ఈ కష్టాలెన్నాళ్లు..? గిట్టుబాటు ధర రాక మార్కెట్లోనే భోరున విలపిస్తోన్న దయనీయ స్థితి