Covid-19 Cases: మాయదారి కరోనా మళ్లొచ్చిందమ్మా.. తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పుట్టిస్తున్న కేసులు..
మళ్లీ క్వారంటైన్ తప్పదా? దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 23 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. నమోదవుతున్న కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. అయితే.. వేరియంట్ మరీ అంత ప్రమాదకరమైంది కాదంటున్నారు వైద్యులు..

ప్రపంచాన్ని షేక్ చేసిన మాయదారి కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో తాజాగా తొలి కొవిడ్ కేసు నమోదైంది. కూకట్ పల్లి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడుకి కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్యు డు ఆదివారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయనకు RTPCR పరీక్ష చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్ అని తేలింది.. రాష్ట్రంలోనూ తొలి కేసు నమోదవ్వడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే 25 పడకల వార్డును సిద్ధం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కొంతమందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని గాంధీ ఆసుపత్రి డా.సునీల్ చెబుతున్నారు. ఎవరికైనా సింటమ్స్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విశాఖలో మహిళకు కరోనా పాజిటవ్..
ఏపీలోని విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటవ్‌గా నిర్దారణైంది. ఆమె కుటుంబం వుంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్‌చేశారు. మరోవైపు కడప రిమ్స్‌లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని సూపరింటెండెంట్ ప్రకటించారు. జలుబు, జ్వరం ఉండడంతో ముందు జాగ్రత్తగా కరోనా వార్డులో అడ్మిట్ చేశారే తప్ప.. కరోనా ఉన్నట్టు నిర్దారణ కాలేదన్నారు డీఎం అండ్ హచ్‌వో. అసలు టెస్ట్ చేయలేదు, చేయడానికి కిట్స్‌లేవని తెలిపారు.
క్లారిటీ ఇచ్చిన మంత్రి..
ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి మాత్రమే నమోయిందన్నారు వైద్య,ఆరోగ్యమంత్రి సత్యకుమార్. ముందస్తుచర్యలపై మంగళగిరిలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారాయనా. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి సత్యకుమార్ సూచించారు.
ఇలాంటి లక్షణాలుంటే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోండి..
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. అప్రమత్తంగా ఉంటే చాలంటున్నారు వైద్యులు. కొన్ని సూచనలు చేశారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే.. వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి . రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి .విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..