తెలంగాణ బోనాల ఉత్సవాలకు భారీగా నిధులు..

|

Jun 10, 2019 | 9:14 PM

తెలంగాణలో బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. జంట నగరాల్లో నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఇవాళ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ జూలై 4వ తేదీ నుంచి ఆషాడ బోనాలు జరుగుతాయన్నారు. బోనాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, వైద్య శాఖ, ఆర్‌ అండ్‌ […]

తెలంగాణ బోనాల ఉత్సవాలకు భారీగా నిధులు..
Follow us on

తెలంగాణలో బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. జంట నగరాల్లో నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఇవాళ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ జూలై 4వ తేదీ నుంచి ఆషాడ బోనాలు జరుగుతాయన్నారు. బోనాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, వైద్య శాఖ, ఆర్‌ అండ్‌ బీ తదితర  శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు.

గోల్కోండ బోనాలు

జులై 4న ప్రారంభమై ఆగష్టు 1వ తేదీ వరకు కొనసాగుతాయి

తొట్ల ఊరేగింపు జులై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌజ్ వద్ద నుంచి ప్రారంభమవుతాయి

 

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు

అమ్మవారి ఘటం ఎదుర్కోళ్లు జులై 7వ తేదీ నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయి

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జులై 21వ తేదీన నిర్వహించనున్నారు

22వ తేదీన రంగం నిర్వహిస్తారు

 

పాతబస్తీ బోనాలు

జులై 28వ తేదీన నిర్వహించబడతాయి