Revanth Reddy: ఆపరేషన్ మూసీ.. వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

|

Sep 25, 2024 | 9:18 AM

మూసీ ప్రక్షాళనలో మార్పు మార్క్‌. ఇచ్చిన మాట ప్రకారం మూసీ బ్యూటిఫికేషన్‌పై శరవేగంగా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్‌. మొదటి విడతలో మూసీ నదీగర్భంలోని ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు సీఎం రేవంత్‌రెడ్డి.

Revanth Reddy: ఆపరేషన్ మూసీ.. వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
CM Revanth Reddy
Follow us on

మూసీ ప్రక్షాళనలో మార్పు మార్క్‌. ఇచ్చిన మాట ప్రకారం మూసీ బ్యూటిఫికేషన్‌పై శరవేగంగా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్‌. మొదటి విడతలో మూసీ నదీగర్భంలోని ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు సీఎం రేవంత్‌రెడ్డి. నిర్వాసితులకు ప్రత్యామ్నయంగా బాధితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఆపరేషన్‌ మూసీ ప్రక్షాళనపై స్వయంగా దృష్టి సారించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

రివర్‌బెడ్‌లోని 1600 ఇళ్లు తొలగింపు..

మూసీ ప్రక్షాళనలో భాగంగా ముందుగా రివర్‌బెడ్‌లోని 1600 ఇళ్లు తొలగించనున్నారు. నిర్వాసితులకు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు.. పట్టాభూమి ఉంటే నిర్మాణ ఖర్చుతో పాటు.. భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలియచేయాలని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. ఇక నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటి వరకు 10,200 మంది నిర్వాసితుల ను గుర్తించారు అధికారులు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో ఆపరేషన్‌ మూసీ ప్రక్షాళన మొదలైంది. రివర్‌ బెడ్‌,FTL పరిధిలోని ఆక్రమణ తొలగింపు మొదలైంది.

మూసీ ప్రక్షాళనపై జరిగిన సమీక్షలో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది కల్గగకుండా చూడాలని అధికారులకు పదే పదే సూచించారు సీఎం రేవంత్‌ రెడ్డి. వాళ్లను ఎక్కడ అకామిడేట్‌ చేయాలో చూడ్డం సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రబాకర్‌ మలక్‌పేటలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పరిశీలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..