Beer Sales In Hyderabad And Telangana: మండుతోన్న ఎండలను తట్టుకోవడం కోసం అనేలా హైదరాబాదీలు తెగ బీర్లు తాగేస్తున్నారు. సాధారణంగా వేసవిలో బీర్ల విక్రయాలు భారీగా పెరుగుతాయి. అయితే ఈసారి మాత్రం ఇంకా ఎండకాలం పూర్తిగా ప్రారంభంకాకముందే విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు మందుబాబులు.
గతేడాదిని మించి ఈ ఏడాది అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం. గత ఏడాది మార్చిలో 26.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగితే ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగడం విశేషం. దీంతో మే నెలలో భారీగా అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో మాత్రం కొంత మేర బీర్ల అమ్మకాల్లో కాస్త తగ్గుదల కనిపించింది. మళ్లీ మార్చి నెలలో అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో 2727.15 కోట్లు, ఫిబ్రవరిలో 2,331.65 కోట్లు, మార్చి నెలలో 2,473.89 కోట్లు కలిపి మొత్తంగా 7,532.69 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని లెక్కలు చెబుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 2020–21లో మొత్తం 27,288.72 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3.3 కోట్ల ఐఎంఎల్ కేసులు, 2.7 కోట్ల బీర్ కేసులు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన చూస్తే రోజుకు సగటున మందుబాబులు 90 వేలకు పైగా ఐఎంఎల్, 74 వేలకు పైగా బీర్ కేసులు తాగేశారన్నమాట.
Black Magic in Telangana: ఆదివారం అర్ధరాత్రి..కోడిని బలిచ్చి క్షుద్రపూజలు.. కోడిగుడ్లు, నిమ్మకాయలతో…
Hyderabad: అతని వయసు 48.. ఆమె వయసు 25.. మాయ మాటలతో ట్రాప్ చేశాడు.. చివరికి ఆ అమ్మాయిని…