Hyderabad: ఆరుగురు అమ్మాయిలు.. 12మంది అబ్బాయిలు.. ఓ గెస్ట్‌హౌస్‌.. కట్ చేస్తే..

|

Sep 11, 2024 | 3:54 PM

అదో అపార్ట్‌మెంట్ లోని గెస్ట్‌హౌస్.. కార్లు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. వాటిల్లో నుంచి 8 మంది అమ్మాయిలు.. 12 మంది అబ్బాయిలు దిగారు.. వారంతా లోపలికి వెళ్లారు.. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. మందు, గంజాయ్.. ధూమ్ మచాలే అంటూ.. ఎంజాయ్ చేస్తున్నారు..

Hyderabad: ఆరుగురు అమ్మాయిలు.. 12మంది అబ్బాయిలు.. ఓ గెస్ట్‌హౌస్‌.. కట్ చేస్తే..
Rave party busted in Gachibowli
Follow us on

అదో అపార్ట్‌మెంట్ లోని గెస్ట్‌హౌస్.. కార్లు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. వాటిల్లో నుంచి 8 మంది అమ్మాయిలు.. 12 మంది అబ్బాయిలు దిగారు.. వారంతా లోపలికి వెళ్లారు.. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. మందు, గంజాయ్.. ధూమ్ మచాలే అంటూ.. ఎంజాయ్ చేస్తున్నారు.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అది మామూలు పార్టీ కాదు.. రేవ్ పార్టీ అని అర్ధమైంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్ గెస్ట్ హౌస్ లో ఎస్వోటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కొంతమంది కలిసి రేవ్‌ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీని భగ్నం చేసి 18 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి టీఎన్జీఎస్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో.. బర్త్‌డే సందర్భంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో గంజాయి, ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లు పేర్కొంటున్నారు.

పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు.. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు యువతులు, 12 మంది యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని గచ్చిబౌలి పోలీసులు వివరించారు. 18 మందికి 41A కింద నోటీసులు ఇస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: వేరే రంగులో ఉన్నాయని చిన్న చూపు చూడకండి.. ఇవి పురుషులకు వరం..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..