రైల్వే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. దసరా పండుగ కోసం నడుపుతోన్న పలు ప్రత్యేక రైళ్ల వేళల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నడవనున్న కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. ఆయా రైళ్ల మారిన టైమింగ్స్‌ను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా 139 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవాలని ప్రయాణీకులను సూచించింది.
అలాగే ముందుగానే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు మారిన వేళల మార్పు సమాచారం అందుతుందని పేర్కొంది. మరోవైపు సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/ 07646), సికింద్రాబాద్–షాలిమార్ (07741/07742), నాందేడ్ -బుర్హంపూర్(07431/07432), త్రివేండ్రం-టాటానగర్(06192/06191) మధ్య దసరా పండుగ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి.
ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్–సంత్రాగచ్చి(07645) స్పెషల్ ట్రైన్.. ఈ నెల 30వ తేదీన ఉదయం 8.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో సంత్రాగచ్చి – సికింద్రాబాద్(07646) ప్రత్యేక రైలు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇక సికింద్రాబాద్-షాలిమార్(07741) అక్టోబర్ 2వ తేదీన ఉదయం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో షాలిమార్-సికింద్రాబాద్(07742) అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 2.55 గంటలకు షాలిమార్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..