Graduate MLC Elections: నామినేషన్ వేయకుండానే వెనుదిరిగిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి.. కారణమేంటంటే..

|

Feb 22, 2021 | 4:39 PM

Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధమైన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు.

Graduate MLC Elections: నామినేషన్ వేయకుండానే వెనుదిరిగిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి.. కారణమేంటంటే..
Follow us on

Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధమైన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. సోమవారం నాడు హైదరాబాద్-రంగారెడ్డి-మహబుబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సురభి వాణిదేవి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. ఆమె నామినేషన్‌ను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. నామినేషన్ ఫారం సరైన ఫార్మాట్‌లో లేదని చెప్పి స్వీకరించలేదు. దాంతో ఆమె మళ్లీ సరైన ఫార్మాట్‌లో నామినేషన్ ఫారం ను సిద్ధం చేశారు. అయితే ఇవాళ నామినేషన్ల స్వీకరణకు సమయం ముగిసిపోవడం వాణిదేవి వెనుదిరిగారు. మంగళవారం నాడు ఆమె తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. కాగా, రేపు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.

దీనికి ముందు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ –రంగారెడ్డి– హైద‌రాబాద్ ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారవు కుమార్తె సురభి వాణిదేవిని ముఖ్యమంత్రి ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు బీఫారం ను కూడా ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందజేశారు. సీఎం కేసీఆర్ చేతుల బీపారం ను అందుకున్న వాణిదేవి.. పార్టీ నేతలు, అనుచరులతో కలిసి నేరుగా నెక్లెస్ రోడ్డునులోని పీవీ ఘాట్‌ను వెళ్లారు. ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అటుతరువాత నామినేషన్ వేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు.

Also read:

అమెరికాలో కరోనా మరణ మృదంగం, 5 లక్షలకు చేరువలో మృతులసంఖ్య, నిపుణుల ఆందోళన

శరవేగంగా జరుపుకుంటున్న పవన్, రానా మూవీ.. సెట్ లో పవన్ ను చూసి అంతా షాక్