Hyderabad: కిడ్నాప్ కేసులో అరెస్టుల పర్వం.. మద్యం పార్టీ ఇచ్చి.. మత్తులో ఉండగానే ఆ పని..

|

Dec 10, 2022 | 2:41 PM

వైశాలి కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు 31 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వైశాలి ఇంటికి అంత మంది జనాన్ని నవీన్ రెడ్డి తీసుకువచ్చారని చెప్పారు. కిడ్నాప్ చేయడానికి ముందు...

Hyderabad: కిడ్నాప్ కేసులో అరెస్టుల పర్వం.. మద్యం పార్టీ ఇచ్చి.. మత్తులో ఉండగానే ఆ పని..
Arrest
Follow us on

హైదరాబాద్ లోని వైశాలి కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు 31 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వైశాలి ఇంటికి అంత మంది జనాన్ని నవీన్ రెడ్డి తీసుకువచ్చారని చెప్పారు. కిడ్నాప్ చేయడానికి ముందు వారందిరకీ పార్టీ ఇస్తానని చెప్పి ఆఫీస్ కు పిలిపించారని పేర్కొన్నారు. తన దగ్గర పనిచేసే వర్కర్స్ తో పాటు బిహారీలను ఆఫీసుకు రప్పించుకున్నట్లు గుర్తించామన్నారు. పార్టీ పేరుతో అక్కడ మద్యం తాగారని.. మద్యం మత్తులో ఉన్న వాళ్లందరినీ కారులో తీసుకొని వైశాల్ ఇంటికి వచ్చారన్నారని చెప్పారు. నవీన్ రెడ్డి దాడికి పాల్పడడంతో వెనకాల వచ్చిన వారందరూ దాడి చేశారు. వైశాలి ఇంట్లో ఉన్న ఫర్నిచర్, సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ లు ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డితో ఉన్న ఆరుగురు ముందుగా దాడి పాల్పడ్డారు. ఆ తర్వాతే మిగిలిన వారు ఎటాక్ చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్లు వివిధ మార్గాల్లో పారిపోయారు. వైశాలిని కిడ్నాప్ చేసి నల్గొండ వైపుగా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోందన్న పోలీసులు.. అందరినీ అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా.. ఆదిభట్ల డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్‌ కేసు తెలంగాణలో కలకలం సృష్టించింది. సుమారు వంద మందితో వెళ్లి యువతిని అపహరించిన ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. బాధితురాలి ఇంటిని ధ్వంసం చేసిన దుండగులు.. పెను బీభత్సం సృష్టించారు. కార్లలో వచ్చి యువతిని ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. నవీన్-వైశాలి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరికీ గతంలోనే వివాహం జరిగినట్లు తెలిస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వైశాలితో తనకు గతంలో వివాహం జరిగిందని నవీన్ వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..